తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఇందిరమ్మ రాజ్యం లో మహిళలకు సముచిత స్థానం – ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇందిరమ్మ రాజ్యం లో మహిళలకు సముచిత స్థానం

-కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కోరం

ఇల్లందు, శోధన న్యూస్ :  తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు సముచిత స్థానం దొరుకుతుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లోఎమ్మేల్యే మాట్లాడుతూ పెదంటి ఆడపిల్లల వివాహానికి లక్ష 16 రూపాయలతో పాటు తులం బంగారం అందజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. మహిళలకు సంక్షేమ పథకాలతో పాటు ఆర్టీసీతో ఉచితంగా ప్రయాణం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఎన్నికల్లో సోనియా గాంధీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు వేగంగా అమలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఇందులో రెండు హామీలను ఇప్పటికే అమలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలకు చేయూత నివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని,అన్నారు. గొప్పలక్ష్యం తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడానికి మెరుగైన పథకాలు ప్రవేశ పెట్టనుందని అన్నారు.ఇందిరమ్మ ఇళ్లు,రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని రెండు సార్లు టి ఆర్ ఎస్ కు అధికారం ఇచ్చారని,అయినప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదని,దళిత బందు,బి.సి బందు కేవలం మాటలకే పరిమితమయ్యాయని అన్నారు.ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు.మీ అందరికీ అందు బాటు లో వుంటానని,మీ వల్ల నే నేను ఎం ఎల్ ఎ గా గెలుపొందానని,మీ నమ్మకాని వమ్ము చేయకుండా బాధ్యత తో పనిచేస్తానని హామీ ఇచ్చారు.అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, ఎంపీడీవో బాలరాజ్ తాసిల్దార్ రవికుమార్, మండల వైస్ ఎంపీపీ ప్రమోద్, సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *