ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా అమలు అమలు చేస్తాం- పినపాక ఎమ్మెల్యే పాయం
ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా అమలు అమలు చేస్తాం
– పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
పినపాక, శోధన న్యూస్ : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పినపాక మండల కేంద్రంలో తొలిసారిగా ఆయన పర్యటించారు. ముందుగా ఈ బయ్యారం క్రాస్ రోడ్ గల పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్ స్త్రీలకు తో కలిసి భారీ ర్యాలీగా వెళుతున్న పాయంకు మల్లారం గ్రామం వద్ద మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సింగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ మద్దులగూడెం గ్రామంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జానంపేట గ్రామంలో హనుమాన్ ఆలయం నుండి సాయిబాబా ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు డాన్సులతో డీజే పాటలకు నృత్యాలు చేశారు. అనంతరం సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటుచేసిన అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాయం చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన మీద నమ్మకంతో గెలిపించిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటారని తెలియజేశారు. కుటుంబంలో సభ్యుడు వలె ప్రతి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొరస ఆనంద్, కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ముక్కు వెంకటేశ్వర్ రెడ్డి, పేరం వెంకటేశ్వర్లు,బొడా ఈశ్వర్, గంగిరెడ్డి సంజీవ రెడ్డి, గట్లా శ్రీనివాస్ రెడ్డి, సూరెడ్డి తిరుపతిరెడ్డి, సర్పంచ్లు కళ్యాణి, ఈసం భవతి, కృష్ణంరాజు, ఉడుముల రవి, పాయం అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.