ఇబ్బందులు తలెత్తకుండా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగాలి
ఇబ్బందులు తలెత్తకుండా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగాలి
-జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అల
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : నామినేషన్ల స్వీకరణలో ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం 117 కొత్తగూడెం రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియను సిసి కెమెరాలలో నమోదు చేయాలని సూచించారు. నామినేషన్లు దాఖలు చేయుటకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని, నామినేషన్ కేంద్రాల్లోకి మూడు వాహనాలను మాత్రమే అనుమతించాలని తెలిపారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్లు దాటి అనుమతించొద్దని సూచించారు. పటిష్ట భద్రత కొనసాగించాలన్నారు. నామినేషన్ వేయుటలో అభ్యర్థులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు ప్రతి ఆర్ ఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ద్వారా సూచనలు అందించాలని తెలిపారు. నామినేషన్ వివరాలను సీరియల్ నంబర్ వారిగా ప్రతి రోజు నామినేషన్స్ రిజిస్టర్ లో నమోదులు చేయాలని తెలిపారు. రిటర్నింగ్ అధికారి శిరీష, డిఎస్పీ రెహమాన్, కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి తహసిల్దార్లు పుల్లయ్య, నాగరాజు, శిరీష, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.