ఇబ్రహీంపట్నంలో పోలీసుల కవాతు
ఇబ్రహీంపట్నంలో పోలీసుల కవాతు
ఇబ్రహీంపట్నం,శోధన న్యూస్: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, సున్నిత ప్రాంతాలైన వెంకట్రమణ కాలనీ, ఓల్డ్ పోలీస్ స్టేషన్, ఎస్ఆర్ఓ ఆఫీస్ మహంకాళి టెంపుల్ కమాన్, మంచాల్ రోడ్, వసుందర జూనియర్ కళాశాల, వైష్ణవి గార్డెన్స్‌లో స్థానిక బలగాలు, స్పెషల్ పార్టీ మరియు ఎఆర్ ఫోర్స్‌తో పారామిలటరీ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ని స్థానిక ప్రజలకు సందేశాన్ని అందించడానికి పరిమితులు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి 160 మంది తో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు.