ఇల్లందు మనుగడ టి బి జి కే ఎస్ కృషి ఫలితమే -టిబిజికేఎస్ అధ్యక్షులు వెంకట్రావ్
ఇల్లందు మనుగడ టి బి జి కే ఎస్ కృషి ఫలితమే
-టి బి జి కే ఎస్ అధ్యక్షులు వెంకట్రావ్
ఇల్లందు, శోధన న్యూస్ : జే కే.ఓ సి లో మంగళా వారం జరిగిన టి బి జి కే ఎస్ గేట్ మీటింగ్ కు వైస్ ప్రసిడెంట్ రంగనాథ్ అధ్యక్షత వహించారు, ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా టి బి జి కే ఎస్ అధ్యక్షుల బి వెంకట్రావ్ పాల్గొని మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం సింగరేణి నాలుగు బొగ్గు బ్లాక్ లు వేలానికి పెట్టినా ప్రవేట్ వ్యక్తులు రాకుండా అడ్డుకున్నది కే సి ఆర్ ప్రభుత్వమేనని, ఇల్లందు లో టెండర్ వేసిన వాడు కూడా అడుగు పెట్టకుండా చేసింది కే సి అర్ ప్రభుత్వమేనని అన్నారు. ఎమ్మేల్యేల కార్మికుల ధర్నాలు, దీక్షలు, సమ్మె కారణంగా ఈ గడ్డమీద ప్రవేట్ వాడు కాలు పెట్టలేదన్నారు.టి బి జి కే.ఎస్ కృషివల్లనే ఇల్లందు నిలబడిందనీ 21 ఇంక్లైన్ మూసివేస్తారన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కే సి అర్ ఆదేశంతో కార్మికులను ట్రాన్స్ఫర్ కాకుండా ప్రొడక్షన్ లేకున్నా కార్మికుల కోసం, ఇల్లందు మనుగడ కోసం ఆ బాయి ని నడిపించిందనీ అప్పటి గుర్తిoపు సంఘం టి బి జి కే ఎస్ మాత్రమేనని అన్నారు. మొన్న జే కే ఓ సి నిలబడటానికి, ఇక్కడి కార్మికులను ట్రాన్స్ఫర్ కాకుండా అపించింది కూడా ట్ టి బి జి కే ఎస్ మాత్రమేనని. ట్రాన్స్ఫర్లు అపినా, ప్రమోషన్ల ఇప్పించినా, డెప్యూటేషన్ ఎక్స్ టెన్షన్ ఇప్పించినా, క్వార్ట ర్లు కార్మికులకు ఇప్పించిన పారదర్శకంగా అవినీతికి తావులేకుండా సేవలు అందించిన సంఘం టి బి జి కే ఎస్ మాత్రమే నని కార్మికులకు డిఫెండింగ్ ఉద్యోగాలు, 61సం.వయోపరిమితి, ఉచిత.ఏ సి, ఉచిత కరెంట్, మహిళలకు ఉద్యోగ అవకాశం, లాభాల వాటా 32 శాతం ఇప్పించిన సంఘం టి బి జి కే ఎస్ అని వెంకటరావు అన్నారు.రంగనాథ్ మాట్లాడుతూ కార్మికుల హక్కులకోసం రాజీలేని పోరాటం మూలంగానే ఇల్లందు ఏరియా కార్మికులకు ప్రొడక్షన్ గిఫ్ట్ అందించాం మని సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కార్మికులకు ఫర్నీచర్ , మినరల్ వాటర్ ప్లాంట్, ఏరియా వర్క్ షాప్,సి హెచ్ పీ , జే కే ఓ.సి ,కే ఓ.సి లలో మినరల్ వాటర్ ప్లాంటులు ఏర్పాటు చేయించామన్నారు.జే కే కార్మిక వాడల్లో నీటి ఎద్దడిని నివారణకు మిషన్ భగీరథ నీళ్ళు అందించామనీ.24, జే కే గ్రౌండ్స్ లో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయించామనీ,సి ఇ అర్ క్లబ్ ను ఆధునీకరించి నామనీ, ఏ సి ఏర్పాటుకు ప్రపోజల్స్ పెట్టించామనీ, సి ఇ అర్ క్లబ్ మెంబెర్స్ కు గిఫ్ట్స్ ఇప్పించ్చామని, కోడ్ వల్ల డిస్ట్రిబ్యూషన్ ఆగిందన్నారు. మొట్టమొదటిగా ఇల్లందులో కార్మికుల సౌకర్యార్థం ఏ సి అంబులెన్సు లు ఏర్పాటు చేయించానమనీ. కార్మికులు విజ్ఞతతో ఆలోచించి కార్మిక శ్రేయస్సుకోసం పనిచేసిన నాయ కత్వాన్ని బలపరచి, 27 న జరిగే ఎన్నికల్లో టి బి జి కే ఎస్ ను గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో పిట్ సెక్రెటరీ కోటయ్య, గౌస్ మియా, బోలెద్దుల ప్రభాకర్, మేకల శంకర్ రావు, రాము , అవుల శ్రీనివాస్ సతీష్, సత్యనారాయణ, అజీజ్, ప్రభాకర్, శేకర్,రామారావు, రాజయ్య, కాంతా రావు, కలువల వెంకటేశ్వర్లు, రవి తదితరులు పాల్గొన్నారు.