ఈవీఎంల పనితీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక
ఈవీఎంల పనితీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఇల్లందు, శోధన న్యూస్ : ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో వినియోగించే ఏవీఎంల పనితీరును శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అలా పరిశీలించారు. సింగరేణి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లోని ఈవీఎంల పనితీరును అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే శాసనసభ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఓటర్లు తమ ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలని ప్రలోభాలకు గురికా వద్దని కోరారు. పోలింగ్ బూత్ లో అక్కడున్న సిబ్బందికి, ఓటు వినియోగించుకోవడానికి వచ్చే ప్రజలకు అవసరమైన అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ప్రత్యేకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఓటింగ్ సందర్భంలో సాంకేతిక లోపం వలన ఈవీఎంలు మురాయిస్తే తక్షణమే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని స్థానిక ఎన్నికల అధికారులకు సూచించారు.