తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ కు పటిష్ట భద్రత-జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక 

ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ కు పటిష్ట భద్రత

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక 

పాల్వంచ, శోధన న్యూస్ : ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ కు పటిష్ట భద్రత  ఏర్పాటు చేసినట్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. నవంబర్ 30వ తేదీన జిల్లా పరిధిలోని ఐదు నియొకవర్గాల్లోని 1098 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ నిర్వహించామని తెలిపారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో రిసిప్షన్ కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ స్వీకరించామని తెలిపారు. పాల్వంచ మండలం,  అనుబోస్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో మూడంచల భద్రత మధ్య భద్రపరిచినట్లు తెలిపారు. ఈ నెల మూడో తేదీన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యవేక్షణకు 18 టీములు ఏర్పాటు చేశామని, ప్రతి టేబుల్ కు ఒక సూక్ష్మ పరిశీలకులు, కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఓట్లు లెక్కింపు పరిశీలకులు కమల్ కిషోర్, హరి కిషోర్, గణేష్, భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్, అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ప్రతీక్ జైన్, రాంబాబు, కార్తిక్, శిరీష, మంగిలాల్, ఆర్ అండ్ బి ఈ ఈ భీంలా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *