ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులు ప్రారంభం
ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులు ప్రారంభం
సత్తుపల్లి , శోధన న్యూస్ : మదర్ థెరిస్సా కాలనీ కిష్టారం గ్రామ మహిళలకు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులను కొత్తగూడెం ఏరియా సింగరేణి సేవ సమితి అధ్యక్షురాలు ఎం. మధుర వాణి షాలెం రాజు ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అందిస్తున్న సేవలను ఆమె కొనియాడారు మరియు సింగరేణి సేవా సమితి ద్వారా ఈ ఉచిత వృత్తి శిక్షణ తరగతులకు హాజరై న నిరుద్యోగ మహిళలు మరియు గృహిణులు వారి కుటుంబాలకు ఆర్థిక లబ్ధిని చేకూర్చుకోవాలన్నారు. వారు ఈ శిక్షణ తరగతులకు శ్రద్ధగా హాజరై నేర్చుకోవాలని మరియు ఇతరులకు నేర్పించాలన్నారు మరియు నూతన వృత్తి శిక్షణ తరగతులను ప్రారంభించాలని ఈ సందర్భంగా తెలియజేశారు మరియు సింగరేణి సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధిని శిక్షణను పొంది ఆర్థిక లబ్ధిని పొందవలసిందిగా సేవా సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమములో కొత్తగూడెం ఏరియా సింగరేణి సేవా అధ్యక్షురాలు ఎం. మధుర వాణిషాలెం రాజు తో పాటు, చాముండేశ్వరి నరసింహారావు, కిష్టారం గ్రామం సర్పంచ్ సిహెచ్.రేణుక ఈశ్వర్, పద్మజారాణి కోటిరెడ్డి,సీనియర్ పిఓ విజయ సందీప్, సింగరేణి సేవా సమితి కోఆర్డినేటర్ సిహెచ్ సాగర్, శిక్షణ తరగతులు ఇచ్చు ఫ్యాకల్టీ మరియు ఇతర సేవ సభ్యులు పాల్గొన్నారు.