తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఉత్పత్తి లక్ష్యాలను సాధనకు కృషి చేయాలి

ఉత్పత్తి లక్ష్యాలను సాధనకు కృషి చేయాలి

–సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) వెంకటేశ్వరరెడ్డి

మణుగూరు, శోధన న్యూస్: రక్షణ వారోత్సవాల స్ఫూర్తితో ప్రతీ ఒక్క ఉద్యోగి బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని  సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) జి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో ఆయన ఏరియా జీఎం దుర్గం రమేష్ తో  కలిసి శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఓసి2 వ్యూపాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను, ఓసి4లో కంటిన్యూయస్ మైనర్ యంత్రం పని తీరును, కేసిహెచ్పీలో సీ10 బెల్ట్ ద్వారా బొగ్గు రవాణా తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో ఎలాంటి అవరోధాలకు తావు లేకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు.  2023-24 వార్షిక సంవత్సరానికి సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను రక్షణ తో విధులు నిర్వహిస్తూ సమిష్టి కృషితో సాధించాలన్నారు. ఉత్పత్తయిన  బొగ్గు సకాలంలో రవాణా అయ్యేలా ఆయా గనుల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే ఓబి  నిర్ధేశిత లక్ష్యాలను కూడా సాధించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం నర్సిరెడ్డి, పికెఓసి పిఓ లక్ష్మీపతిగౌడ్, పికెఓసి ప్రాజెక్ట్ ఇంజనీర్ వీరభద్రుడు, డిజిఎం(కెసిహెచ్పీ) మధనానాయక్, ఓనికి మేనేజర్ సురేష్, ఓసి4 మేనేజర్ డి శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి షబ్బీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *