ఉన్నత అధికారుల సమావేశం
ఉన్నత అధికారుల సమావేశం
భద్రాచలం, శోధన న్యూస్: రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కొత్తగూడెం జిల్లా ప్రోహిబిషన్ , ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ బోర్డర్ కో – ఆర్డినేషన్ మీటింగ్ సారపాక ఐటీసి పేపర్ బోర్డ్ ప్రాంగణంలోని మయూరి సమావేశ మందిరంలో కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ అధికారి జానయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ ఉమ్మడి ఖమ్మం జిల్లా అబ్కారీ డిప్యూటీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్గర్ రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సహకారంతో తెలంగాణలోకి మద్యం, నాటు సారాయి, గంజాయి లాంటి మత్తు పదార్థాలు దిగుమతి కాకుండా చర్యలు తీసుకోవడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తాత్కాలిక బోర్డర్ చెక్ పోస్ట్ ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న చెక్ పోస్టుల ను బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాల అధికారులతో కలిసి సరిహద్దు ప్రాంతాలలో ఉమ్మడి దాడులు నిర్వహించి ఎక్సైజ్ నేరాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.