ఉపాధ్యాయురాలికి మహానంది జాతీయ అవార్డు
ఉపాధ్యాయురాలికి మహానంది జాతీయ అవార్డు
గుండాల, శోధన న్యూస్ : ఈ నెల 9న హైదరాబాద్ మల్కాజ్ గిరిలోని సాయి లింగ బ్లాంకెట్ హాల్ ఈస్ట్ ఆనంద్ బాగ్ లో నిర్వహించిన మహానంది పురస్కార మహోత్సవ కార్యక్రమంలో గుండాల మండలం మామకన్ను ఏకలవ్య పాఠశాల మ్యాజిక్ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న కొమరం సంజిత కళా రంగంలోనూ విద్యారంగంలో విశిష్ట సేవలు అందించి నందుకు గాను హైదరాబాదుకు చెందిన ఏ ఎన్ ఎస్ 24 టెలివిజన్ ఎండి మానుకొండ నాగరాజు, ముఖ్య అతిథి డాక్టర్ చింతపట్ల వెంకటాచారి ,టీవీ, సీఈవో , అశోక్ కుమార్, రవీంద్ర ఆచార్యులు, వనపర్తి, పద్మావతి, వారి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి సర్టిఫికెట్ మహానంది పురస్కారం ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా బాధ్యతను ఈ అవార్డు మరింత పెంచిందని అన్నారు. కళా విద్యా రంగాలలో సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేసిన ఏఎన్ఎస్ 24 యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.