ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
పినపాక, శోధన న్యూస్ : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏడూళ్ళబయ్యారం గ్రామపంచాయితీ పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుంజా తిరుపతి(30)కి భార్యకు మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. గొడవల కారణంగా మనస్థాపానికి గురైన తిరుపతి శనివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి సొదరీ ఏడూళ్ళబయ్యారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు.