తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఊళ్ళకు వెళ్లే  వారు  జర భద్రం —మణుగూరు సీఐ రమాకాంత్

ఊళ్ళకు వెళ్లే  వారు  జర భద్రం

—మణుగూరు సీఐ రమాకాంత్

మణుగూరు, శోధన న్యూస్ : సంక్రాంతి సెలవుల సందర్భంగా మండల, పట్టణ పరిధిలో ఊళ్ళకు వెళ్లే ఇంటి యజమానులు జర భద్రంగా ఉండాలని, వెళ్లే ముందు తమ వివరాలను పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని మణుగూరు సీఐ రమాకాంత్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు,  మణుగూరు డీఎస్పీ ఆదేశాల రాఘవేంద్రరావు ఆదేశాల మేరకు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దొంగతనాలు జరగకుండా నివారించేందుకు అన్ని ప్రాంతాల్లో పెట్రోలింగు ముమ్మరం చేస్తున్నామన్నారు. సెలవుల వల్ల తమ ఇంటిని విడిచి ఊర్లకు వెళ్తున్నప్పుడు తమ వివరాలను, లో కె షన్ షేర్ చేయడం వల్ల ఆ ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేస్తామన్నారు. ఊర్లకు వెళ్తున్న వారు విలువైన ఆభరణాలను, వస్తువులను తమ వెంట తీసుకెళ్ళడం మంచిదని, లేదా వాటిని జాగ్రత్తగా భద్రపర్చుకునేలా చూసుకోవాలని సూచించారు. ఇంటికి నాణ్యమైన తాళాలు వె యాలని, ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిసి కెమెరాలను ఉన్నట్లయితే తమ స్మార్ట్ ఫోన్కు కనెక్ట్ చేసుకుని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చన్నారు. ఇంటి యజమానులు తమ సమాచారాన్ని 63039 22272 ఫోన్ నెంబర్లకు వాట్పాప్ ద్వారా వివరాలను, గూగుల్ లో కేషన్ను పంపించవచ్చునన్నారు. సమాచారం అందిండం ద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో పోలీస్ వారి నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ బీట్, పెట్రోలింగ్ను చేపట్టునున్నట్లు తెలిపారు. ఇంటి పరిసరాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానితుల సంచారం ఉన్నట్లయితే 100 డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వీటన్నింటిని మానిటరింగ్ చేసేందుకు పోలీస్ కంట్రోల్ రూమ్ను సైతం ఏర్పాటు చేశామన్నారు. దొంగతనాలను అరికట్టడంలో భాగంగా జిల్లా ఎస్పీ, డిఎస్పిల ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్బాటు చేశామన్నారు. ఎలాంటి చోరీలకు అవకాశం లేకుండా రక్షణ చర్యలు చేపట్టేందుకు స వాకరించాలని సీఐ రమాకాంత్  కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *