తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఎక్స్ లెంట్ పాఠశాలలో మాక్ నిర్వహణ

ఎక్స్ లెంట్ పాఠశాలలో మాక్ నిర్వహణ

మణుగూరు, శోధన న్యూస్ :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బాంబేకాలనీ ఎక్స్ లెంట్ హైస్కూల్ లో  మాక్ ఎలెక్షన్స్ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు ఎన్నికల పై అవగాహన కల్పించేందుకు ఈ  కార్యక్రమాన్ని చేపట్టారు.  పాఠశాల ప్రధానోపాద్యాయులు ఎన్నికల ప్రకటనను విడుదలచేశారు. ఎన్నికల పోటి చేసే విద్యార్థులు తమ నామినేషన్ పత్రాలను ప్రధానోపాధ్యాయులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.పోటిల్లో ఉన్న విద్యార్థులకు తమకు కేటాయించిన గుర్తులతో ,తమ మద్దతు దారులతో‌ కలిసి,ప్రతి తరగతి గది తిరుగుతూ,ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. తరగతి విద్యార్థుల సంఖ్యను బట్టి,ఓటర్ల లిస్టు ను తయారు చేశారు.కొందరు విద్యార్థులు ఎన్నికల పిఓ గా విధులు నిర్వహించారు. వారు ఎన్నికల సామాగ్రితో వారికి కేటాయించిన కేంద్రాలకు ముందుగానే పోలింగ్ చేరుకొని అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ లో పాల్గొనే విద్యార్థులు ఓటింగ్ కేంద్రాల ముందు తమ ఓటును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు గల పోస్టర్లను అంటించారు. పాఠశాల ప్రాంగణమంతా నిజమైన ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోటీలో ఉన్న విద్యార్థుల సమక్షంలో ఓట్లు లెక్కింపు ప్రక్రియ నిర్వహించి  పోటీలో  గెలిచిన విద్యార్థి పేరును ప్రధానోపాదహయులు  ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఎండి ఖాదర్, యూసఫ్, జేఎం  ఖాన్,  గబ్బర్ఉ, పాధ్యాయినీ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *