ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించండి
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించండి
-కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్
అన్నపురెడ్డిపల్లి, శోధనన్యూస్: ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని, ఎవ్వరు కూడా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడొద్దని కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో రాజకీయ నాయకులకు,ప్రజలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని వ్యక్తిగతంగా కానీ,రాజకీయంగా కానీ, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు కట్టుబడి పని చేయాలన్నారు. రూ50 వేలకు మించి నగదు తీసుకెళ్లద్దాని, ఒకవేళ తీసుకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నగదుకు సంబంధించిన పత్రాలు ఉండాలని తెలిపారు. లేని పక్షంలో ఆ నగదును సీజ్ చేస్తామన్నారు.అలాగే గ్రామాల్లో ఎక్కడైనా గొడవలు అల్లర్లకు ఎవరూ పాల్పడవద్దని,ఒక వేళ ఎక్కడైనా గొడవలు జరిగితే సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని అన్నారు. ఎలక్షన్ కు సంబంధించి ర్యాలీలు,సమావేశాలు ఏర్పాటు చేసుకోదలిస్తే సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.ప్రతిఒక్కరూ పోలీసులకు, అధికారులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సిఐ ఎం శ్రీనివాస్, ఎస్సై షాహిన, కానిస్టేబుళ్లు జాన్ పాషా,గోపాలకృష్ణ, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.