ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం-మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం
-మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ
ఇల్లందు , శోధన న్యూస్ : ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని గార్ల మండల కేంద్రంలోని బి అర్ ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికలలో గెలుపోటములు సహజమని, బి అర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధైర్యపడవద్దని, మీకు అన్నివేళలా అందుబాటులో ఉంటామని, ఎన్నికలలో పని చేసిన మండలంలోని ప్రజాప్రతినిధులకు, మండల నాయకులకు, ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోరం కనకయ్య కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోత్ బిందు, గార్ల మండల బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్ నాయక్, ఎంపిటిసి ల పోరం మండల అధ్యక్షులు శీలంశెట్టి రమేష్, బాలాజీ తండా సర్పంచ్ రత్నావత్ శంకర్, గార్ల పట్టణ అధ్యక్షులు గాజుల గణేష్, మండల ఉపాధ్యక్షులు బుడిగ మురళి, ఆత్మ కమిటీ జిల్లా సభ్యులు మందనపు భాస్కరరావు, మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ అమర్ చంద్, మండల యూత్ అధ్యక్షులు కట్టా రమేష్ మండల బి అర్ ఎస్ పార్టీ మండల నాయకులు కోట ఉత్తరయ్య, మోడేం కొమురయ్య, గద్దపాటి నరసింహ, రెడ్డిమల్ల ఉమేష్, బీరవెల్లి లక్ష్మారెడ్డి, వంగూరి అనిల్, సంగిశెట్టి ప్రభాకర్, శ్రీరామ్ విజయ్ కుమార్, కళ్యాణ్, డీజే శ్రీను, గూగులోత్ వెంకటేష్, సోషల్ మీడియా ప్రతినిధులు వల్లపుదాసు వెంకటేశ్వర్లు, సిరుమర్తి చంద్రశేఖర్ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.