ఎన్నికల నిబంధనలకు లోబడి నాడుచుకోవాలి -అన్నపురెడ్డిపల్లి ఎస్సై షాహిన
ఎన్నికల నిబంధనలకు లోబడి నాడుచుకోవాలి
-అన్నపురెడ్డిపల్లి ఎస్సై షాహిన
అన్నపురెడ్డిపల్లి, శోధన న్యూస్ : రేపు వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో భాగంగా ఎన్నికల నిబంధనలకు లోబడి నాడుచుకోవాలని అన్నపురెడ్డిపల్లి ఎస్సై షాహిన తెలిపారు. శనివారం ఎస్సై షాహిన విలేకరులతో మాట్లాడుతూ..ఏ పార్టీ అభ్యర్థి గెలిచిన కూడా ప్రతి ఒక్కరూ ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉండాలని,ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని అన్నారు. ఎవరిని రెచ్చగొట్టే విధంగా,హింసాత్మకంగా ఏ ఒక్కరూ ప్రవర్తించవద్దని, గెలిచిన ఏ పార్టీ వారు కూడా ర్యాలీలు,సభలు,సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. బాణాసంచాలు,టపాసులు కాల్చకూడదని డీజే బాక్సులు లౌడ్ స్పీకర్లుఎక్కడా పెట్టవద్దని తెలిపారు. సోషల్ మీడియాలో ఎటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ, ఇతర రాజకీయ పార్టీ వ్యక్తులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టరాదని ఆమె అన్నారు. అలానే 144 సెక్షన్ అమల్లో ఉన్నందున నలుగురు కంటే ఎక్కువగా గుంపులుగా ఉండవద్దని,మద్యం ఎక్కడ అమ్మకాలు జరుపవద్దని, తెలిపారు. అభ్యర్థుల గెలుపు ఓటముల గురించి బెట్టింగ్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అలానే పోలీసుల సహాయం కోసం 100 కాల్ చేయాలని ఆవిడ తెలిపారు.