ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
-ఇల్లెందు సీఐ కరుణాకర్
ఇల్లందు శోధన న్యూస్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఇల్లందు సీఐ కరుణాకర్ హెచ్చరించారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇల్లందులో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లు దాటి ఉండాలని, వాహనాలను 200 మీటర్ల దూరంలో పార్కింగ్ చేయాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున గుంపులు గుంపులుగా ఎక్కడ ఉండరాదని తెలిపారు. ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు పాల్పడినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు ఈ విషయాలను గమనంలోకి తీసుకోవాలని కోరారు.