ఎన్నికల నియమావళిని పాటించాలి
ఎన్నికల నియమావళిని పాటించాలి
– సిఐ రవీందర్
అశ్వాపురం, శోధన న్యూస్: రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమాలని పాటించాలని సిఐ జి రవీందర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసిల్దార్ రమాదేవి అధ్యక్షతన ఎన్నికల నియమాలు పై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వినియోగించుకునేలా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలు పాటించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, సోషల్ మీడియా మీద పోలీస్ శాఖ నిఘా ఉంటుందని తెలిపారు. నిజా నిజాలు తెలుసుకోకుండా పోస్టులు పెడితే గ్రూప్ అడ్మిన్ మీద చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఎన్నికల సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, ఇతర శాఖల సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వరప్రసాద్, ఆర్ ఐ లు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.