ఎన్నికల ప్రత్యేక అధికారి విస్తృతంగా వాహనాల తనిఖీలు
ఎన్నికల ప్రత్యేక అధికారి విస్తృతంగా వాహనాల తనిఖీలు
ఆళ్లపల్లి, శోధన న్యూస్ : కేంద్ర ఎన్నికల శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల ప్రత్యేక అధికారుల సూచనల మేరకు ఉమ్మడి గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని అనుమానితులను, వాహనాలపై ఆధారాలు లేని ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వాహనదారులను, వాహనాలను తనిఖీలను నిర్వహించేందుకు ఉమ్మడి గుండాల, ఆళ్లపల్లి మండలాలకు సంబంధించిన ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం అధికారిగా ఇన్చార్జిగా బాధ్యతలును అప్పజెప్పడం జరిగిందని, గణేష్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఉమ్మడి గుండాల, ఆళ్లపల్లి మండల పరిధిలోని రాయపాడు, ముత్తాపురం, అనంతోగు, అలాగే గుండాల మండలంలోని వరంగల్ జిల్లా పరిధిలోగల పసర, లింగగూడెం, రంగాపురం రహదారులలో విస్తృతంగా తనిఖీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఆక్రమణంలోనే ఆళ్లపల్లి మండలంలో గల యూనియన్ బ్యాంక్ సిబ్బంది, రైతులకు, ప్రజలకు సంబంధించిన నగదు 5 లక్షల రూపాయల తరలిస్తుండగా వాటికి సంబంధించి, ద్రౌపత్రాలను పరిశీలించడం జరిగిందని, వారిని వివరాలను తెలుసుకొని పంపడం జరిగిందన్నారు. ఎవరైనా రైతులు, వ్యాపారస్తులు, డ్వాక్రా మహిళా సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎవరైనా నగదు డబ్బులకు ఎటువంటి ఆధారాలు లేకపోతే వాటిని సీజ్ చేయడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, ఎన్నికల అధికారులకు పంపడం జరుగుతుందన్నారు. ఎవరైనా ఎలాంటి నగదు లావాదేవీల ప్రక్రియలకు ప్రత్యేకంగా వాటికి సంబంధించిన ఆధారాలు తప్పకుండా కలిగి ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ యాంద్రాటి శ్రీనివాసరావు, కెమెరామెన్ కోతి శేఖర్, వాహన డ్రైవర్ ఉన్నారు.