ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆకస్మిక పర్యటన
ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆకస్మిక పర్యటన
ఆళ్లపళ్లి, శోధన న్యూస్ : ఉమ్మడి గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో భద్రాచలం ఐటిడిఓ పీఓ, పినపాక నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతిక్ జైన్ శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆళ్లపల్లి మండల పరిధిలోని అనంతోగు క్రాస్ రోడ్డు వద్ద (ఎఫ్ఎఎస్ స్టీ) ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఉమ్మడి గుండాల, ఆళ్లపళ్లి మండలాల ఇన్చార్జి గణేష్ నాయక్ వాహనాల తనిఖీలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల అభివృద్ధి, పరిషత్ అధికారులను పోలింగ్ బూతులు, మౌలిక వసతులను ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పోలింగ్ బూతుల స్లిప్పులను, ఓటర్లకు పంపిణీ చేయాలని, ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా, భయభ్రాంతులకు లోనవ్వకుండా నిర్భయంగా తమకున్న ఓట్లను సద్వినియోగం చేసుకునేందుకు, ఓటర్లను, ప్రజలను అవగాహన కల్పించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మార్తీ రామారావు, ఎంపీఓ బత్తిని శ్రీనివాసరావు, కార్యదర్శులు రమేష్, వెంకటేశ్వర్లు, తాటి నాగరాజు, ప్రవీణ్ కుమార్, జీవన్, కానిస్టేబుల్స్ రాజేశ్వరరావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.