ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి
ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి
—పినపాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్
మణుగూరు, శోధన న్యూస్: నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని పినపాక నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని ఇల్లెందు గెస్ట్ హౌస్ లో పిఓ, ఏపిఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి పినపాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ హాజరై ఎన్నికల విధి విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క పిఓ, ఏపిఓ ఈవిఎం, వివిప్యాట్లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో ఈ విఎం మిషన్లలో లోపాలు తలెత్తితే సెక్టోరియల్ అధికారులకు. ఏఆర్ఓలకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ ఎన్నికల్లో సిబ్బంది అన్కితభావంతో, నిబద్ధతతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సిపిఓ శ్రీనివాస్, పినపాక నియోజకవర్గ అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి రాఘవరెడ్డి, మాస్టర్ ట్రైనర్లు వరప్రసాద్. రామి రెడ్డి, భాస్కర్, పరమయ్య, కోటేశ్వరరావు, రవికుమార్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.