ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ సెంటర్
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ సెంటర్
-కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి
రాజన్న సిరిసిల్ల, శోధన న్యూస్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉండి ఇది వరకే ఫారం -12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సిబ్బందికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఎన్నికల విధుల్లో ఉండి ఇప్పటి వరకూ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని సిబ్బంది ఈ నెల 24 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకూ సిరిసిల్ల, వేములవాడ తహశీల్దార్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ సెంటర్ లో కార్యాలయాల పని వేళల్లో పోస్టల్ బ్యాలెట్ ను సిబ్బంది వినియోగించుకోవాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు.