ఎన్నికల సాధారణ పరిశీలకులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం
ఎన్నికల సాధారణ పరిశీలకులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలతో ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల్ కిషోర్, హరి కిషోర్, గణేష్ మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికలు నిర్వహణకు చేపట్టిన చర్యలను కలెక్టర్ వివరించారు. పరిశీలకులు పోలింగ్ కేంద్రాల్లో చేస్తున్న ఏర్పాట్లును గత కొన్ని రోజుల నుండి పరిశీలిస్తున్నామని సంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఉన్నాయని, వాటిలో పినపాక, భద్రాచలంలకు హరి కిశోర్, కొత్తగూడెం నకు కమల్ కిశోర్, అశ్వారావుపేట, భద్రాచలం లకు గణేష్ లను ఎన్నికల సంఘం నియమించారనితెలిపారు. నామినేషన్లు ఉపసంహరణకు రేపు తుది గడువు కావున సంబంధిత రిటర్నింగ్ అధికారులు నామినేషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ ఫారంను తీసుకొని తెలుగు అక్షరమాల ప్రాతిపదికన బ్యాలెట్ పేపర్ లిస్టు తయారు చేస్తూ స్వతంత్ర అభ్యర్థులకు సింబల్ కేటాయింపు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రతిపాదనలు అందజేయాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పినపాక రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ తదితరులు పాల్గొన్నారు.