ఎన్నికల సిబ్బంది రిపోర్ట్ చేయాలి -పినపాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్
ఎన్నికల సిబ్బంది రిపోర్ట్ చేయాలి
-పినపాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్
మణుగూరు, శోధన న్యూస్ : తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో పినపాక నియోజకవర్గంలో పోలింగ్ విధులు కేటాయించిన సిబ్బంది 29వ తేది బుధవారం ఉదయం 6 గంటలకు మణుగూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో రిపోర్ట్ చేయాలని భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రతిక్ జైన్ మంగళవారం తెలిపారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రంలోనే 30వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో మెటీరియల్ తిరిగి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రిసెప్షన్ కేంద్రం కూడా అక్కడే ఏర్పాటు చేసినందున పోలింగ్ మెటీరియల్ తో సిబ్బంది హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు.