ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సన్మానం
ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సన్మానం
టేకులపల్లి, శోధన న్యూస్ : ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్యను ఇల్లందు క్యాంప్ ఆఫీసులో పి ఆర్ టి యు ఉపాధ్యాయులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు మోతిలాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తూ ప్రతి నెల క్రమం తప్పకుండా 1వ తేదీన రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ జీతాలు ఇవ్వాలని సి పి ఎస్ ను రద్దు చేయాలని 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని 40 శాతం ఫిట్మెంట్తో కూడిన పి ఆర్ సి ఇవ్వాలని ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న 3 డి ఎ లతో పాటు అన్ని రకాల పెండింగ్ బిల్లులను వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని అలాగే ఐటీడీఏ ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టడంతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఈ సమస్యలన్నింటిని తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరం కనకయ్యని కోరారు.ఉపాధ్యాయుల సమస్యల పట్ల శాసనసభ్యులు సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు టి రవీందర్, రమేశ్ బాబు, ప్రసాద్, బి బాలు విజయనిర్మల, బి మోహన్, మంగి లాల్ ,వీరన్న తదితురులు పాల్గొన్నారు.