ఖమ్మంతెలంగాణ

ఎర్రుపాలెంలో శాతవాహన ఎక్స్ ప్రెస్ నిలపాలని రైల్వే అధికారులకు వినతి  

 శాతవాహన ఎక్స్ ప్రెస్ నిలపాలని రైల్వే అధికారులకు వినతి  

ఎర్రుపాలెం, శోధన న్యూస్ : ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ లో ఈ ప్రాంత ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజయవాడ- సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ ను నిలపాలని తెలంగాణ రాష్ట్ర ప్రయాణికుల సంఘం అధ్యక్షులు మధిర నివాసి వాసిరెడ్డి హనుమంతరావు రైల్వే జనరల్ మేనేజర్, తెలంగాణ రాష్ట్ర మంత్రులకు శనివారం హైదరాబాదులో వినతి పత్రంఅందించారు.ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ విజయవాడ- సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ ను ఎర్రుపాలెంలో హాల్ట్ ఇప్పించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ను సికింద్రాబాద్ లో శనివారం కలిసి వినతిపత్రం అందించినట్లు తెలియజేశారు.అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావుకు,మధిర ఎమ్మెల్యే,రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు,రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, పాలకుర్తి ఎమ్మెల్యే యాశస్వని రెడ్డికి,డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, పూతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్ కు దీనిపై వినతి పత్రాలు అందించినట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాలగా ఎర్రు పాలెం మండల ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎర్రుపాలెంలో శాతవాహన ఎక్స్ ప్రెస్ నిలుపుదల చేయాలని కోరుతున్నారని అయినా రైల్వే అధికారులు స్పందించలేదని తెలిపారు.ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా దీనిపై వినతి పత్రాలు రైల్వే జనరల్ మేనేజర్ కు అందించారని గుర్తు చేశారు.గతంలో తన ఆధ్వర్యంలో మధిరలో శాతవాహన ఎక్స్ప్రెస్ నిలుపుదల చేయించిన సంగతి ఈ ప్రాంత ప్రయాణికులకు విధితమే అని అన్నారు.ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లాకి చివరి మండలం గాను, ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దు లో ఉందన్నారు.దినదిన అభివృద్ధి చెందుతున్న ఎర్రుపాలెం మండలంనకు ఏడు కిలోమీటర్ల దూరంలో తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన స్వయంభు జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నదని దీనికి ఖమ్మం జిల్లాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా,కృష్ణాజిల్లా, పశ్చిమ,తూర్పు తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల నుండి నిత్యం భక్తులు వస్తుంటారని వారికి జమలాపురం రావడానికి రైలు మార్గం ఎర్రుపాలెంలో ఉన్నది.కనుక ఎర్రుపాలెం లో శాతవాహన ఎక్స్ ప్రెస్ ఆగినట్లయితే వారందరూ ఈ రైలు ద్వారా వచ్చేందుకు అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.ఉదయం ఎరుపాలెం రైల్వే స్టేషన్ కు శాతవాహన 7 గంటలకు వస్తుందని హైదరాబాద్, ఖమ్మం,వరంగల్ 11,12 గంటల కల్లా చేరుకోవచ్చునని,మరల సాయంత్రం నాలుగు గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి రాత్రి 9 గంటల వరకు ఎర్రుపాలెం చేరు కోవటానికి ప్రయాణికులకు తేలికైన ప్రయాణంగా ఉంటుందని తెలిపారు.దీనిపై ప్రజాప్రతినిధులు,రైల్వే జనరల్ మేనేజర్ కూడా స్పందించారని అన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందించి త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి అమలు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపినట్లు హనుమంతరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *