ఏడవ రోజు 10 నామినేషన్లు దాఖలు
ఏడవ రోజు 10 నామినేషన్లు దాఖలు
సత్తుపల్లి , శోధన న్యూస్ : ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు నుండి గురువారం 10 నామినేషన్లు దాఖలు చేశారు. భారత రాష్ట్ర సమితి తరపున సండ్ర వెంకట వీరయ్య, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి డాక్టర్ మట్టా రాగమయి, భారతీయ జనతా పార్టీ తరపున నంబూరు రామలింగేశ్వరరావు, నంబూరు శిరీష రావు, మన టిఆర్ఎస్ పార్టీ తరఫున నారపోగు ప్రసాద్ బాబు, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తరపున గద్దల సుబ్బారావు, ధర్మ సమాజ పార్టీ నుండి మేడి బసవయ్య, బహుజన సమాజ్ పార్టీ నుండి శీలం వెంకటేశ్వరరావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి మట్టా దయానంద్ విజయకుమార్, బహుజన్ ముక్తి పార్టీ నుండి మిక్కిలి గాంధీ నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్ అశోక చక్రవర్తికి అందజేశారు.