ఐటీడీఏ డిడి అలసత్వంతోనే కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం
ఐటీడీఏ డి డి అలసత్వంతోనే కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం
-ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు హరీష్
ఇల్లందు, శోధన న్యూస్: ఐటీడీఏ డిడి అలసత్వంతోనే కిందిస్థాయి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు హరీష్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు విఠల్రావు భవనం లో ఏర్పాటు చేసిన ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో ఎన్నో సమస్యలు నెలకొని ఉన్న పై స్థాయి అధికారులు పట్టించుకునే యోచన లేదని ఇదే అదునుగా అశ్వరావుపేట మణుగూరు, భద్రాచలం, పాల్వంచ ఏరియాలలో సైతం ఏ టి డి ఓ ల నిర్లక్ష్య పాలన కొనసాగుతుందని, విద్యార్థి సంఘాలను రాకుండా పిఓ ఇచ్చిన తాత్కాలికమైన ఆర్డర్ ను ఉపసంహరించుకోవాలని అన్నారు. ఏసీ గదికే పరిమితమైన పిఓ పాలన ఇకనైనా సంక్షేమ హాస్టల్లో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విద్యార్థి సంఘాలను హాస్టల్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. తద్వారానే విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకొని అధికారులు దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కార దిశగా మార్గాలు ఉంటాయని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సాయి, సుభాష్,వెంకటేష్,జి సాయి,నీరజ్ తదితరులు పాల్గొన్నారు.