ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
మధిర, శోధన న్యూస్ : మధిర అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు దాఖలు చేసిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి గణేష్ అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించారు. మొత్తం 22 మంది మధిర అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. వీటిలో ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఒరిజినల్ బీఫారం అందజేయక పోవటంతో బిఎస్పీ అభ్యర్థి శారద నామినేషన్ తిరస్కరణకు గురైంది. అదేవిధంగా సరైన పత్రాలు ఇవ్వకపోవడంతో దారెల్లి రమేష్, మద్దాల ప్రభాకర్, నరసింహారావు, పుల్లయ్య, నామినేషన్లు తిరస్కరించబడ్డాయి.