ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి
ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి
-ఏడూళ్ళ బయ్యారం ఎస్ఐ సతీష్
పినపాక, శోధన న్యూస్ : ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం ఎస్.ఐ సతీష్ ప్రజలకు సూచించారు.ఆదివారం రాత్రి ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో పోలీసు,సిఅర్పియఫ్ సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ సతీష్ మాట్లాడుతూ… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల భాగంగా ఓటు హక్కు అనేది రాజ్యాంగ ఇచ్చిన హక్కు అని ,ఎటువంటి ప్రలోభాలకు లోంగవద్దని తెలిపారు. ఓటు అనేది సమాజంలో చాలా విలువైనది అని తెలిపారు.ఓటు వేసే సమయంలోఎలాంటి సమస్య వచ్చిన మీకు పోలీసు వ్యవస్థ ప్రజలకు అండగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమం లో టిఎస్పియస్ ఎస్.ఐ నిశాంత్,పోలీసు, సిఅర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.