ఓటు హక్కును వినియోగించుకునేందుకే ప్లాగ్ మార్చ్
ఓటు హక్కును వినియోగించుకునేందుకే ప్లాగ్ మార్చ్
-డీసీపీ లక్ష్మీనారాయణ, ఆర్డిఓ రాజు
జమ్మికుంట ,శోధన న్యూస్: నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకే పోలీసులు, బిఎస్ఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని లా అండ్ ఆర్డర్ డిసిపి లక్ష్మీనారాయణ, ఆర్డిఓ రాజు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని డిసిపి లక్ష్మీనారాయణ, ఆర్డిఓ రాజు జెండా ఊపి ప్రారంభించారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా గాంధీ చౌరస్తా, బస్టాండ్, కరెంట్ ఆఫీస్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. ఈ సందర్భంగా డిసిపి లక్ష్మీనారాయణ, ఆర్డిఓ రాజు మాట్లాడుతూ… త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా జరిపించే క్రమంలో మూడు కంపెనీల బిఎస్ఎఫ్ బలగాలు నియోజకవర్గానికి చేరుకున్నాయని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పగడ్బందీగా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు బిఎస్ఎఫ్ బలగాలు జిల్లా యంత్రాంగంతో మమేకమై విధులు నిర్వహిస్తారని తెలిపారు. సమాజంలో ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడంతో పాటు చట్టాన్ని ఉల్లంగించడం చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం వంటి చర్యలు చేపట్టే వారికి భయాన్ని కల్పించే దిశగా పోలీసు, బిఎస్ఎఫ్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెడితే ఎంతటి వారి పైన నైనా చట్టపరమైన చర్యలు తప్పువని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం పట్ల బాధ్యతతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.