ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగి ఉండాలి
ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగి ఉండాలి
కారేపల్లి, శోధన న్యూస్: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగి ఉండి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మీటకోటి సింహాచలం విద్యార్థులకు సూచించారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మీటకోట సింహాచలం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్యనికి పునాది అని,ప్రాణి కోటి జీవులకు ప్రాణవాయువు ఎంత అవసరమో,ప్రజాస్వామ్య మనుగడకు ఓటు అంతే అవసరం అని అన్నారు. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురికాకుండా నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. తల్లిదండ్రులుకు, గ్రామస్తులు అందరూ ఓటు హక్కు వినియోగించునేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవాపథకం అధికారులు జయప్రకాశ్, అధ్యాపకులు మల్లిక, దుర్గాప్రసాద్, వనిత, రమ, లక్ష్మీనారాయణ, యాకయ్య, రాంబాబు, ఖాసీం, బాబురావు, కవిత, కృష్ణవేణి, పాషా, సుధీర్, సతీష్, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.