ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.55 లక్షల మంది ఓటర్లు
పోలింగ్ కు సర్వం సిద్ధం
– ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.55 లక్షల మంది ఓటర్లు
-184 పోలింగ్ బూత్ల ద్వారా ఓటింగ్ ప్రక్రియ
అశ్వారావుపేట , శోధన న్యూస్: అసెంబ్లీ ఎన్నికల తుది అంకానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఐదు మండలాల లోని 1.55 లక్షల మంది ఓటర్లు నేడు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో గాను 20 పోలింగ్ బూత్లకుగాను16,555 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అశ్వరావుపేట మండలంలో 51 పోలింగ్ కేంద్రాలకు గాను 45,765 మంది ఓటు హక్కును వినియోగించుకోనుండగా, దమ్మపేట మండలంలో 52 పోలింగ్ బూత్ లకు గాను43,427 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. అలాగే ములకలపల్లి మండలంలో 34 పోలింగ్ బూత్ లకు గాను 27,067 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనుండగా, చుండ్రుగొండ మండలంలో 27 పోలింగ్ బూత్ లకు గాను23,147 మంది ఓటర్లు తమతమ ఓటు హక్కును నేడు వినియోగించుకొ నున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాటులను చేసినట్లు నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి, జిల్లా అడిషనల్ కలెక్టర్ పర్సా రాంబాబు పేర్కొన్నారు.