ఖమ్మంతెలంగాణ

కాంగ్రెస్ అభ్యర్థి  గెలుపుకు  కృషి చేయాలి

కాంగ్రెస్ అభ్యర్థి  గెలుపుకు  కృషి చేయాలి

ఏన్కూరు, శోధన న్యూస్ : వైరా నియోజకవర్గంలో టిడిపి,సిపిఐ,కాంగ్రెస్ పార్టీలతో కలిసి వైరా కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థి మాలోతు రాందాస్ నాయక్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాం గ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వర్ణ నరేంద ర్ అన్నారు. మండల కేంద్రమైన ఏనుకూ రులో కమ్మవారి కళ్యాణ మండపంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు , టిడిపి నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్వర్ణ నరేందర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి టిడిపి సంపూర్ణ మద్దతు తెలప డం కాంగ్రెస్ పార్టీ విజయానికి నాందిని ఆయన అన్నారు.మాజీ ముఖ్యమంత్రి టిడి పి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో టిడిపి పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి ముందుకు రావడం సంతోషదాయకమన్నా రు.త్వరలో జరిగే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ వర్గాలకు అతీతంగా అంద రం కలిసి పనిచేస్తామన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయడానికి అందరూ సైనికుల పనిచేయాలని కోరారు.పార్టీలు వేరైనా ఒకే ఎజెం డాతో పనిచేస్తామని టిడిపి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని నాయకుల oతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆరెం రామయ్య, తాళ్లూరి అప్పారావు, కొనకంచి రామకృష్ణ, కోపెల రామారావు, జనార్ధన్, గాదె శేషయ్య, రాంబాబు, తోట రాధాకృష్ణ,భరపాటి శ్రీను, బానోతు నరసింహారావు, కొమ్మూ రి శంకరయ్య  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *