కాంగ్రెస్ అభ్యర్థి రాఘమైని గెలిపించండి – కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ అభ్యర్థి రాఘమైని గెలిపించండి
– కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
కల్లూరు , శోధన న్యూస్ : హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మట్ట రాఘమై ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమె సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు కల్లూరు పట్టణంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ఆడపడుచులకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 ,
రైతులకు ప్రతి ఎకరాకు సంవత్సరానికి 15 వేల రూపాయలు, దళితులకు అంబేద్కర్ పథకం కింద 12 లక్షలు
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడపడుచులకు పెళ్లి కానుకగా గ్రాము బంగారం ఎలక్ట్రికల్ స్కూటీ లక్ష రూపాయలు పెళ్లి కానుకగా అందిస్తామని ప్రియాంక గాంధీ అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మట్ట రాఘమై దయానంద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద భారీ బందోబస్తు నడుమ రోడ్డు షో లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక అల్లాడుచున్నారని కష్టపడి చదివి పరీక్షలు రాసిన గాని వాటిని రద్దుచేసి విద్యార్థుల జీవితాలతో ఆటాడుతున్నారని ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణలో ఉన్న ఆడపడుచులు అందరికీ ప్రతినెల మహాలక్ష్మి పథకం క్రింద 2500 వందల రూపాయలు, రైతులకు ప్రతి ఎకరాకు సంవత్సరానికి 15000 రూపాయలు, వృద్ధులకు మరియు 56 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరికి ప్రతినెల 4000 రూపాయలు పెన్షన్ కింద, దళితులకు అంబేద్కర్ పథకం కింద 12 లక్షల రూపాయలు, ఇందిరమ్మ రాజ్యంలో కట్టిన ఇండ్లు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని అటువంటి పథకాలు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుపేదలకు ఇల్లు కట్టుకోవటానికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని ,కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆరు పథకాల కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకాలు వర్తించే రీతిగా కాంగ్రెస్ కట్టుబడి ఉందని మీ పవిత్రమైన ఓటు కాంగ్రెస్ పార్టీపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గద్దనెక్కనుందని సేవాలాల్ పేరుమీద స్కీమ్ ఏర్పాటు చేసి లంబాడీలకు పూర్తి భూమి హక్కు పత్రాలను ఇచ్చే విధంగా పోడుభూమి పై హక్కు కలిగిన ప్రతి ఒక్క ఆదివాసీలకు భూమి పట్టా అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి నల్ల బంగారం సింగరేణి మీ ప్రైవేట్ పరం చేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారని అధికారంలోకి రాగానే అటువంటి వాటిని వ్యతిరేకించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అది మన అందరి సొత్తుగా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ మట్ట రాఘమయిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ సత్తాను చాటాలని ప్రతి ఒక్కరు హస్తం గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రియాంక గాంధీ కల్లూరు మండల ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ మట్టా దయానంద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.