కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి… కారెక్కిన 40కుటుంబాలు
కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి… కారెక్కిన 40కుటుంబాలు
అశ్వారావుపేట, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ము లకలపల్లి మండలం కమలాపురం గ్రామంలో మడివి నాగరాజు ఆధ్వర్యంలో 40కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీనీ వీడి బిఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి దమ్మపేటలోని వారి నివాసంలో అందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బైటి వెంకటేష్, మడివి నరేంద్ర,కలితి విర బాబు,బత్తుల చిట్టి బాబు,గడ్డం రాంబాబు,గడ్డం రవి బాబు,విర బాబు,మదివి వెంకటేష్,గడ్డం రాజులు, మడి చిరమప్ప,వాడే కృష్ణ,గడ్డం నాగేంద్ర బాబు తదితరులు ఉన్నారు.