కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
-మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, శోధన న్యూస్: కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఆయన నాయకులతో కలిసి సాంబాయిగూడెం, చిక్కుడుగుంట తదితర గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ… గడప గడపకు ప్రచారం నిర్వతి వాంచారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ కార్డ్ పథకాలను వివరించారు. కాంగ్రెస్ అధికారం వస్తే మహాలక్ష్మీ పథకం క్రింద ప్రతీ నెల మహిళలకు రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా క్రింద రైతులకు, కౌలు రైతులకు రూ.15వేలు పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, వరిపంటకు రూ.500బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. గృహజ్యోతి పథకం క్రింద ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు, ఉద్యమకారులకు ఇంటిస్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. యువ వికాసం పథకం క్రింద విద్యార్థులకు రూ.25లక్షల వరకు విద్యాభరోసా కార్డ్, ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్ నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నెలవారీ పింఛన్లు రూ.4 వేలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ద్వారా రూ. 10 లక్షల సాయం అందించనున్నట్లు తెలిపారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆధరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ఎంపిపి కరివేద వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామా శ్రీనివాస్ రెడ్డి, తాటి బిక్షం, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.