కాంగ్రెస్ నాయకుల గడప గడపకు ప్రచారం
కాంగ్రెస్ నాయకుల గడప గడపకు ప్రచారం
మణుగూరు, శోధన న్యూస్: మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామపంచాయితీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం గడప గడపకు ప్రచారం నిర్వహించారు. గడప గడపకు కాంగ్రెస్ పాదయాత్రలో భాగంగా నాయకులు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ కార్డ్ పథకాలను, డిక్లరేషన్లను వివరిస్తూ.. కరపత్రాలను పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆధరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మణుగూరు వైస్ఎంపిపి కరివేద వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్ గోరంట్ల కనకయ్య, నాగేశ్వరరావు, సాంబ, రాబిన్ కుమార్, శ్రీనివాసరావు, భాస్కర్, నాగేంద్రబాబు, పాయం యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.