కాంగ్రెస్ నుంచి 40 కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరిక
కాంగ్రెస్ నుంచి 40 కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరిక
-ఆహ్వానించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మణుగూరు, శోధన న్యూస్: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్,చేపల మార్కెట్, పైలట్ కాలని ఏరియాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 40 కుటుంబాలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. ఈసందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఎజెండానే బిఆర్ఎస్ ఎజెండా అని, పేదల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం పతరిపించే నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ పథకాలు అందే విధంగా రూపకల్పన చేసి ఆచరణలో అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రెండేళ్లు కరోనా మమ్మారి పీడించిన రైతు బంధు రైతు బీమా వంటి పథకాలను నిలుపుదల చేయకుండా అమలు చేసిన ప్రభుత్వం మన తెలంగాణ ఒకటేనని వెల్లడించారు. కరోనాకాలంలో కనపడని కొందరు నాయకులు ఎన్నికలు వచ్చేసరికి అధికారం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. వచ్చె ఎన్నికల్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న బిఆర్ఎస్ ను ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.