కాంగ్రెస్ పార్టీని అ త్యధిక మెజార్టీతో గెలిపించాలి
కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
- పాలేరును అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయం
- మాజీ మంత్రి తుమ్మల,మాజీ ఎంపీ పొంగులేటి
నేలకొండపల్లి, శోధన న్యూస్ : కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కోరారు. నేలకొండపల్లి సీతారామగార్డన్ లో జరిగిన మండల బూత్ కమిటీల సమన్వయ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే నా ధ్యేయమనీ, ప్రజలంతా చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఎల్ల వేళలా నేను అండగా ఉంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకుపోయి కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఓట్లు తీసుకురావాలని బూత్ కమిటీ మెంబర్లకు తెలిపారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ నుండి సుమారు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. నేలకొండపల్లి మాజీ సర్పంచ్ నాగేశ్వరావు, అమ్మగూడెం, పయనంపల్లి, కొరట్ల గూడెం, నేలకొండపల్లి కి చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారినీ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికు లాగా పనిచేసి నా గుర్తు చేతి గుర్తు, చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, నేలకొండపల్లి మండల బూతుల సమన్వయ కమిటీ నాయకులు నెల్లూరు భద్రయ్య, మామిడి వెంకన్న, శాఖమూరీ రమేష్, కుక్కల హనుమంతరావు, వెన్నపూసల సీతారాములు, ఆరికట్ల గురవయ్య, నేలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, బూతు కమిటీల సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు, పాల్గొన్నారు.