కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీ తో గెలిపించాలి-మాజీ మంత్రి తుమ్మల
కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీ తో గెలిపించాలి
-మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఇల్లందు, శోధన న్యూస్ : కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీ తో గెలిపించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలను కోరారు. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరావు,ఎం పి పి నాగరత్నమ్మ, వార్డు కౌన్సిలర్లు గురువారం మాజీమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర నా యకులు తుమ్మల నాగేశ్వరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. డి వి స్వగృహం లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాజీ మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కోసం గోదావరి జలాలతో సస్య శ్యామలం చేయాలని నాడు బి(టి)అర్ఎస్ లో చేరానని, నాతో పాటు వేలాది మంది పార్టీలో చేరారని తెలిపారు. , అహంకార చర్యల వల్ల పార్టీ పెద్దలే ఓడించారని అన్నారు. బిఆర్ఎస్ అవినీతి అరాచక పాలనతో బీఅర్ఎస్ పార్టీ నీ వదిలేసానని పేర్కొన్నారు.తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రాహుల్ గాంధీ నాయకత్వం పై విశ్వాసం తో కాంగ్రెస్ లో చేరానని అన్నారు. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గా డీవీ అభివృద్ధి కి పాటుపడ్డారనీ తెలిపారు. ఇల్లందు నియోజకవర్గం లో రహదారులు ఏర్పాటు తో విద్య, వైద్యం ఏజెన్సీ వాసులకు దక్కాయన్నారు. నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ లో చేరిన మున్సిపల్ చైర్మన్ డీ వీ కి కాంగ్రెస్ లో భవిష్యత్ భాద్యత నాదనీ స్పష్టం చేశారు. ఇల్లందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య ను గెలిపించాలని తుమ్మల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో కోరం కనకయ్య,మాజీ మునిసిపల్ చైర్మన్ అనసూర్య నాయకులు దొడ్డ డానియల్,కనగాల పేరయ్య,జానీ,కాంగ్రెస్ లో చేరిన వార్డు సభ్యులు వారా రవి, నవీన్ లు ఉ న్నారు.