కాంగ్రెస్ పార్టీలో చేరికలు
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
మణుగూరు, శోధన న్యూస్ : కాంగ్రెస్ పార్టీ పినపాక అసెంబ్లీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో పినపాక మండల బీ(టి)ఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, మున్నూరుకాపు సంఘ నాయకులు బొడ్డు ఏసుబాబు, నాయకుడు ముత్యం శెట్టి వెంకటేశ్వర్లు ఆ పార్టీని వీడి ఆదివారం పాయం క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఆయన కాంగ్రె స్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర, నియోజకవర్గ ప్రజల్లో రోజురోజుకీ కాంగ్రెస్ పార్టీ పై ఆధరణ పెరుగుతోందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత, రైతు భరోసా, యువ వికాసం పథకాలను తక్షణమే అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొడిశాల రామనాధం, వలసాల వెంకటరామారావు, గాండ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.