కాంగ్రెస్ పార్టీలో వైస్ ఎంపిపి, సర్పంచ్ చేరిక
కాంగ్రెస్ పార్టీలో వైస్ ఎంపిపి, సర్పంచ్ చేరిక
జూలూరుపాడు, శోధన న్యూస్ : బిఆర్ఎస్ పార్టీకి చెందిన మండల వైస్ ఎంపిపి, గుండె పూడి సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గుండె పూడి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోత్ రాందాస్ నాయక్,ప్యాక్స్ చైర్మన్ లేళ్ళ వెంకట రెడ్డి సమక్షంలో వైస్ఎంపిపి గాదె నిర్మల,గాదె కృష్ణయ్య,సర్పంచ్ బాణోత్ నర్సింహారావు లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాందాస్ నాయక్ ఎంపిపి,సర్పంచ్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి ఆరు గ్యారెంటీ పథకాలులను సామాన్య,మధ్యతరగతి ప్రజల నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన నాటి నుంచి మండలంలో సర్పంచులు, ఎంపిటిసిలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.ఎన్నికలు ముగిసే లోపు బిఆర్ఎస్ పార్టీ మండలంలో ఖాళీ అవుతుందని రాందాస్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు కొమ్మినేని పాండురంగారావు,కళ్యాణపు నరేష్,బొడ్డు కృష్ణయ్య, మాలోత్ మంగిలాల్ నాయక్, వేల్పుల నర్సింహారావు, దుద్దుకూరి సుమంత్, కంచర్ల సూర్యప్రకాష్ రావు,అనగంటి ధనమయ్య తదితరులు పాల్గొన్నారు.