ఖమ్మంతెలంగాణ

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల పనిచేయాలి

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల పనిచేయాలి
-కాంగ్రెస్  రాష్ట్ర ప్రచార కమిటీ కో కన్వినర్ పొంగిలేటి
కామేపల్లి, శోధన న్యూస్ : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర ప్రచార కమిటీ కో కన్వినర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పాత లింగాల గ్రామంలో రాం రెడ్డి కుటుంబ సభ్యులను పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ,ఇల్లందు నియోజకవర్గంలో ఎవరికి టికెట్ వచ్చిన కార్యకర్తలు పట్టుదలతో పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకోవడం ఖాయం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ రెడ్డి,కోరం కనకయ్య, మానుకొండ రాధా కిషోర్, పుచ్చకాయల వీరభద్రం, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి ,ఎంపీటీసీలు రాంరెడ్డి జగన్నాథరెడ్డి, నల్లమోతు లక్ష్మయ్య,మాలోత శంకర్ నాయక్ ఇట్టా శ్రీనివాస్,గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *