కాంగ్రెస్ మేనిఫెస్టోలో మున్నూరు కాపు కార్పొరేషన్ అంశాన్ని చేర్చడం హర్షణీయం
కాంగ్రెస్ మేనిఫెస్టోలో మున్నూరు కాపు కార్పొరేషన్ అంశాన్ని చేర్చడం హర్షణీయం
- మున్నూరుకాపు నాయకులు
మణుగూరు, శోధన న్యూస్ : కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మున్నూరుకాపులకు స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చేర్చడం పట్ల మణుగూరు మండల మున్నూరుకాపు సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక మున్నూరుకాపు సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ… గత అనేక సంవత్సరాలుగా మున్నూరుకాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలకు విన్నవించడం జరిగిందన్నారు. కానీ నేటి వరకు ఏ ప్రభుత్వం కూడా మున్నూరు కాపు కార్పొర కషన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఈ దఫా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మున్నూరు కాపు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడను కాకుండా మున్నూరు కాపు యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాల పంపిణీ చేస్తామని కాంగ్రె స్ మేనిఫెస్టోలోని అభయ హస్తంలో చేర్చడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సమావేశంలో మున్నూరుకాపు సంఘం పినపాక నియోజకవర్గ నాయకులు వలసాల వెంకటరామారావు, నాయకులు గాండ్ల సురేష్ బొడ్డు ఏసుబాబు, వారాల వేణు, దాచేపల్లి శ్రీను, కుర్రి చలపతి రావు, పులిశెట్టి బాబు, వెంకటేశ్వర్లు. తదితరులు పాల్గొన్నారు.