కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వాలు
కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వాలు
మణుగూరు, శోధన న్యూస్: కోర్టు తీర్పులను అమలు చేయకుండా, కనీస వేతనాలు చెల్లించకుండా సింగరేణి కాంట్రాక్టు కార్మికుల శ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని ఇఫ్టూ అనుబంధ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏరియా అధ్యక్షుడు మంగిలాల్ అన్నారు. బుధవారం ఓసి2లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కాంటాక్ట్ కార్మికుల వేతన పెంపుకు సంబంధించిన జి వోను, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలు చేయకుండా తాత్సార్యం చేస్తూ కోర్టు దిక్కరణకు పాల్పడుతున్నాయని అన్నారు. సింగరేణిలో ఉత్పత్తి, ఉత్పాతకతలో అతి తక్కువ వేతనాలతో శ్రమిస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా విషయంపై సానుకూలంగా స్పందించిన సింగరేణి యజమాన్యం మౌనం వీడాలని ఆయన కోరారు. సింగరేణి లాభాల వాటాలో కాంట్రాక్ట్ కార్మికులను కూడా భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంటాక్ట్ కార్మికుల వేతనం పెంపు కై రాజకీయ పార్టీల పై ఒత్తిడి తేవాలని కాంట్రాక్ట్ కార్మికుల వేతన సవరణ ఉద్యోగ భద్రత, సంక్షేమం తదితర హక్కుల సాధన పోరాటాలతోనే సాధ్యమవుతాయని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు అందరూ రాజకీయాలకతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.