తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

కారు గుర్తును గెలిపించండి-అభివృద్ధి,  సంక్షేమాన్ని కొనసాగించండి

కారు గుర్తును గెలిపించండి-అభివృద్ధి,  సంక్షేమాన్ని కొనసాగించండి

-బి అర్ ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్

ఇల్లందు, శోధన న్యూస్: కారు గుర్తును గెలిపించండి..అభివృద్ధి,  సంక్షేమాన్ని కొనసాగించండి అంటూ ఎమ్మెల్యే, బి అర్ ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్ అన్నారు. ఇల్లందు మున్సిపాలిటీ లోని  పలు వార్డ్ లలో ఎమ్మెల్యే, బి అర్ ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్ మంగళవారం  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లందు మున్సిపాలిటీకి, పట్టణ ప్రజలకు గత ఐదే ళ్లుగా అందించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మళ్ళీ అధికారంలోకి వచ్చాక చేపట్టే కార్యక్రమాలను వివరించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కెసిఆర్ నాయకత్వంలో తిరిగి మూడోసారి అధికారం లోకి రావడం ఖాయమన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రజలకు అందాలంటే బి అర్ ఎస్ ను గెలిపించు కోవాలని కోరారు.మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించడం ద్వారా ఎంతో అభివృద్ధి సాధించామని,ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.కే సి అర్ తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చడంలో ముందు వరస లో వుంటారని అన్నారు.ప్రజలకు కల్ల బొల్లి మాటలు చెప్పి మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్న పార్టీలను ఓ కంట కనిపెట్టాలని కోరారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ,వార్డ్ కౌన్సిలర్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *