కారేపల్లిలో ఘనంగా అయ్యప్పల ఇరుముడి
కారేపల్లిలో ఘనంగా అయ్యప్పల ఇరుముడి
– కార్యక్రమం లో పాల్గొన్న ఇన్‌కం ట్యాక్స్ కమీషనర్ జీవన్‌లాల్
-భక్తులకు అన్నదానం
కారేపల్లి , శోధన న్యూస్ : మండల కేంద్రమైన కారేపల్లి సాయిమందిరంలోని అయ్యప్పపీఠం మాలధారులు ఆదివారం ఇరుముడి కార్యక్రమాన్ని జరిపారు.41 రోజులు మండల దీక్ష చేసిన అయ్యప్పమాలధారులు మొక్కులు తీర్చుకోవటానికి ఇరుముడిని ఎత్తుకోని శబరి బయలు దేరారు. శబరి యాత్ర సందర్బంగా అయ్యప్ప ఇరుముడిని గురుస్వాములు పాలిక సారయ్య,గుగులోత్ రాందాస్,తేజావత్ శంకర్, కేతిమళ్ల శ్రీను,సంగు సాయి,పాలిక శ్రీనుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా అయ్యప్ప శరణుఘోష తో కారేపల్లి మారుమోగింది.ఇరుముడి కార్యక్రమానికి రాష్ట్ర ఇన్‌కం ట్యాక్స్ కమీషనర్ లావుడ్యా జీవన్‌లాల్ హజరై పీఠం వద్ద పూజలు నిర్వహించారు. అయ్యప్పల ఆశీస్సులను తీసుకున్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప యాత్ర విజయవంతంకావాలని, రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిలాలని స్వామిని కోరుకోవాలని ఆకాంక్షించారు. ఇరుముడికి భారీగా జనం రావటంతో నిర్వాహకులుభక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఐఆర్‌ఎస్ జీవన్‌లాల్ వెంట ఎంపీపీ మాలోత్ శకుంతలకిషోర్, సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు,వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, బీఆర్‌ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ,సంత ఆలయ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య,సర్పంచ్ మాలోత్ కిషోర్,మండల కోఆప్షన్ ఎండీ.హనీఫ్,ఆజ్మీర బిచ్చానాయక్,వాంకుడోత్ నరేష్,జూపల్లి కృష్ణ, బానోత్ కోటి,జూపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.