కారేపల్లి మండలంలో స్వల్ప భూకంపం…..
కారేపల్లి మండలంలో స్వల్ప భూకంపం…..
కారేపల్లి, శోధన న్యూస్: సింగరేణి మండలంలో ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు విశ్వనాథపల్లి,బొక్కల తండా,కారేపల్లి క్రాస్ రోడ్,కారేపల్లి,గేటుకారేపల్లి, కమలాపురం,పేరుపల్లి తదితర గ్రామాలలో స్వల్పంగా భూమి కనిపించింది. అనుకోకుండా భూమి కంపించడంతో ఇండ్లలోని ప్రజలు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు.స్వల్ప భూకంప ప్రభావంతో ఇండ్లలోని సామాన్లు కింద పడగా, భయంతో ఇళ్లలో నుంచి ప్రజలు పరుగులు తీశారు. కాగా ఎలాంటి ఆస్తి,ప్రాణ నష్టం కాని జరగక పోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.